Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Police Arrested BJP Leader Bharat Reddy

By   /  December 12, 2017  /  Comments Off on Police Arrested BJP Leader Bharat Reddy

    Print       Email

బీజేపీ నేత భరత్‌ రెడ్డి అరెస్ట్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

గత కొన్ని రోజులుగా దళితులపై దాడి చేసి అవమానించిన కేసులో బీజేపీ నేత భరత్‌రెడ్డి కేసు విషయంలో అనేక మలుపులు తిరిగి భరత్ రెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడాడు. 22 రోజులుగా పరారీలో ఉన్నభరత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగ పట్నం గ్రామంలో మొరం తవ్వకాన్ని అడ్డుకున్నందుకు రాజేశ్వర్, లక్ష్మణ్ అనే ఇద్దరు దళిత యువకులను ఉద్దేశ పూర్వకంగా వేధించి, దాడి చేసినట్టుగా భరత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

చేతులు కట్టుకుని తప్పుచేశామని ఒప్పుకోవాలని బూతులు తిడుతూ కర్రతో దాడి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో గత నెలలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచి భరత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. లక్ష్మణ్‌, రాజేశ్వర్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా భరత్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. భరత్ రెడ్డి భయంతోనే తాము షార్ట్ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్నట్టుగా అబద్ధం చెప్పామన్న బాధితులు వేధింపులు నిజమే అన్నారు. భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు. గత నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భరత్‌రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →