Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Political Parties ..campaign in Warangal, Khammam Corporation..

By   /  March 2, 2016  /  Comments Off on Political Parties ..campaign in Warangal, Khammam Corporation..

    Print       Email

 

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ లో పార్టీల ముమ్మర ప్రచారం..

InCorpTaxAct
Suvidha

warangal muncipal corporation

 

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లు, అచ్చంపేట నగర పంచాయతీల్లో విజయంపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మళ్లీ ఈ ఎన్నికల్లో మరోసారి విపక్ష పార్టీలకు పరాభవం తప్పదని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు తమదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నాయి.దీంతో తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు,అచ్చంపేట నగర పంజాయతీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఓ పక్క టీఆర్ఎస్.. మరోవపక్క విపక్ష పార్టీలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాగే విస్తృతంగా రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. ఇక.. వరంగల్‌లోని పలు డివిజన్లలో మంత్రి హరీష్‌రావు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో అంతా తానై పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు. అలాగే హరీశ్ తో పాటు బాబు మోహన్ సహా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వరంగల్ లో ఈ సారి టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేస్తుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

వరంగల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసి కొత్త చరిత్ర సృష్టిస్తామని మంత్రి తుమ్మల చెబుతున్నారు. పలు ట్రేడ్ యూనియన్లకు చెందిన కార్మికులు మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు.మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ‌కుమార్ ఖమ్మం 11,14,18 డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

 

ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్థానిక నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పదువులు లేనప్పుడు వాటి కోసం పార్టీలు మార్చే నాయకులను నమ్మవద్దని కోరుతున్నారు. అలాగే .. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే బాలరాజు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో టీఆర్ఎస్‌దే విజయం అని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలు కూటమిగా బరిలోకి దిగిని విషయం తెలిసిందే. మరి ఈ పోరులో మళ్ళీ అధికార పక్షమే విజయం సాధిస్తుందా.. లేక విపక్షాల ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →