Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Political Party Equations are changing in Andhra Pradesh

By   /  March 7, 2018  /  Comments Off on Political Party Equations are changing in Andhra Pradesh

    Print       Email

ఏపీ రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయా?

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ – కాంగ్రెస్ క‌లిసి పోటీ చేస్తాయా?
* కేవీపీ టీడీపీ ఎంపీల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం వెనుక ఆంత‌ర్యం అదేనా?
* ఏపీ రాజ‌కీయాల్లో కొత్త‌కొత్త మార్పులు
డెక్క‌న్ అబ్రాడ్‌: రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న‌ది మ‌రోసారి రుజువైంది. గ‌త రెండు రోజులుగా ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే అది నిజ‌మ‌నికూడా అనిపిస్తోంది. పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు టీడీపీకి అనుకూల‌గా ఉన్న కొంత‌మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాలో పాల్గొన‌డం.. టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొని మ‌ద్ద‌తు ఇవ్వ‌డం చూస్తుంటే త్వ‌ర‌లో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మాత్రం అర్థ‌మ‌వుతోంది. పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్షలకు వారి ఆజన్మ శత్రువులు అయిన కాంగ్రెస్ నాయకులు వచ్చి మద్దతివ్వడం విశేషం.

అసలే కరడుగట్టిన కాంగ్రెస్ ఎంపీలు… పైగా వారిలో ఒకరైన రేణుకాచౌదరి.. పక్కా తెలంగాణ వాది.. తెలంగాణ ఎంపీ కూడా. ఆమెకూడా వచ్చి నిరసనలో పాల్గొన్నారు. కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో హోదా కొరకు డిమాండ్ చేస్తూ పోరాటం సాగించడంలో నిజానికి అన్ని పార్టీల కంటె కూడా సీనియర్ అని చెప్పాలి. చూడబోతే.. ఇదేమైనా భవిష్యత్ రాజకీయ పరిణామాలను సంకేతరూపంలో తెలియజేస్తున్న సంగతా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. చంద్రబాబునాయుడు అవసరమైతే బీజేపీతో కటీఫ్ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో.. ఆయనకు ఎవరో ఒకరి పొత్తు అవసరం.. అందుకోసం కాంగ్రెస్ మీద ఈసారి ఆధారపడతారా అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →