Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Politics Heat Up In AP

By   /  February 20, 2016  /  Comments Off on Politics Heat Up In AP

    Print       Email

హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలుtdp flag with ycp flag new

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అటు వైసీపీ.. ఇటు టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఖాళీ అవుతుందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తూంటే .. తమతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టచ్ ఉన్నారంటూ వైసీపీ కూడా ప్రచారం చేస్తోంది.

InCorpTaxAct
Suvidha

టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చిన జగన్..
వైసీపీతో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారంటూ ఇటీవల జగన్ పేల్చిన బాంబుతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ముఖ్య నేతలు ఆ ఎమ్మెల్యేలు ఎవరా అని ఆరా తీశారట. దీంతో వారికి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగు చూశాయని సమాచారం. ఆర్ధికంగా వెనుకబడ్డ, బడుగు బలహీన వర్గాలకు చెందిన టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలపై జగన్ కన్ను వేశారని వారికి సమాచారం అందిందట. అదీ సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులోని కొందరు ఎమ్మెల్యేలను వైసీపీలోకి చేర్చుకోవాలని జగన్ స్కెచ్ వేసినట్లు వారికి తెలిసిందట. దీనికోసం ఆ జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ నేత ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందట. ఈ పరిణామాల గురించి తెలీయడంతో టీడీపీ అప్రమత్తమైందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

 

దీంతో టీడీపీ.. మూలన పడేసిన ఆపరేషన్ ఆకర్ష్ కు మళ్లీ పదును పెట్టిందని తెలుస్తోంది. అనంతపురం తప్పితే మిగిలిన సీమ జిల్లాల్లో టీడీపీ వీక్ గా ఉంది. ఆయా జిల్లాల్లో గత సాధారణ ఎన్నికల్లో వైసీపీకే అధిక సీట్లు వచ్చాయి. పైగా ఇరు పార్టీలకు పెద్దగా ఓట్ల శాతంలో కూడా తేడా లేకపోవడం టీడీపీని కలవరపెడుతోంది. దీంతో సీమ జిల్లాల్లో టీడీపీని బలంగా చేసేందుకు ఆ జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత భూమా నాగిరెడ్డిని టీడీపీ గూటికి చేర్చాలని భావిస్తున్నారట. ఆయనతో పాటు కుమార్తె అఖిల ప్రియ కూడా సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్దమైందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం.

 

వీరు పచ్చ కండువా కప్పుకోవడానికి లోకేష్ స్థాయిలో చర్చలు జరిగిపోయాయని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం బెజవాడలో భూమా నాగిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. వీరు టీడీపీలో చేరిన తర్వాత కడప జిల్లాని టార్గెట్  చేయాలని టీడీపీ నేతలకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయట.

 

రీసెంట్ గా నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వారి రాకతో పాత లీడర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్త వారిని ఆహ్వానించడంతో పాటు..

వారి రాకను వ్యతిరేకిస్తున్న వారిని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో పార్టీ జెండాలు మోస్తున్న పాతవారికి ఏదో రకమైన పదవులు కట్టబెట్టాలని పార్టీ హై కమాండ్ భావిస్తోందట. రానున్న బడ్జెట్ సెషన్స్ కు ముందే పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను వీలైనంతమందిని చేర్చుకుని వైసీపీకి చెక్ పెట్టాలనేది టీడీపీ వ్యూహంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి.. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏ పార్టీ పై చేయి సాధింస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →