‘ఘాజీ’కి ప్రముఖుల ప్రశంసలు..
సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫస్ట్ మూవీగా ‘ఘాజీ’ తెరకెక్కింది. అంతేకాదు.. రీసెంట్ గా రిలీజ్ అయి సెన్సెషనల్ హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రంపై టాలీవుడ్ అగ్రదర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతలా ఈ మూవీ అందరి అభిమానాన్ని పొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది.
ప్రముఖ దర్శకుల స్పందన..
‘దర్శకుడు సంకల్ప్కి ఈ సినిమా బ్రిలియంట్ డెబ్యూ. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ’- వంశీ పైడిపల్లి
‘ఆన్ స్క్రీన్ లోనే కాదు. ఆఫ్ స్క్రీన్ కెప్టెన్ అండ్ క్రూ, రానాకి శుభాకాంక్షలు’- ఎస్.ఎస్.రాజమౌళి
‘ఘాజీ సినిమాని చూస్తున్నంతసేపూ మంచి అనుభూతికి లోనయ్యాను. దర్శకుడు సంకల్ప్ అండ్ టీం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్ గా రానా సబ్ మెరైన్ ని బాగా నడిపించాడు. దీన్ని డైరెక్టర్ మంచి నేర్పుతో తెరకెక్కించాడు. కథను నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలకు శుభాకాంక్షలు. నా స్నేహితుడు మధు సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే’- కొరటాల శివ
‘తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు, ఓ థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతి వచ్చేలా మంచి చిత్రం అందించినందుకు ‘ఘాజీ’ మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు’- క్రిష్
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.