ఆ సీన్ సినిమాకే హైలెట్..!
బ్లాక్‌బస్టర్ అందుకోవాలన్న ఎన్టీఆర్ కోరిక ‘జనతాగ్యారేజ్‌తో నెరవేరిందా లేదా అన్న విషయం కాసేపు పక్కనబెట్టండి. ప్రస్తుతం ఆ సినిమాలో ఓ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాల్లోకి అదే బెస్ట్ సీన్ అంటూ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతలా ఆ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రాజీవ్ కనకాల పాత్ర సాగే ఆ 20 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు మంచి హైలెట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవినీతిపరులకు అండగా నిలవడం కంటే మరణమే బెటర్ అనే ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో రాజీవ్ కనకాల కనిపిస్తాడు. అలాంటి వ్యక్తి ఓ సమస్యకు పరిష్కారం కోసం జనతా గ్యారేజ్‌కి వస్తాడు. అక్కణ్నుంచి ఓ 20 నిమిషాల పాటు సాగిన ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అయింది. ఎన్టీఆర్, రాజీవ్ నటన, కొరటాల సంభాషణలు వెరసి ఆ సీన్‌ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇలాంటి సీన్లు మరి కొన్ని ఉండి ఉంటే.. సినిమా రేంజ్ ఓ రకంగా ఉండేదని అభిమానులు సైతం అనుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.