Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Power Star Pawan Kalyan – Birthday Celebrations @ Atlanta

By   /  August 24, 2018  /  No Comments

    Print       Email
అట్లాంటాలో అట్ట‌హాసంగా సెప్టెంబ‌ర్ 2 న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక‌లు
రాజ‌కీయం అంటే రాచ‌రికం కాదు.. రాజ‌కీయం అంటే ప్ర‌జా సేవ అంటూ భార‌త దేశ రాజ‌కీయాల్లో న‌వ‌శ‌కానికి నాందీ ప‌లికీ.. సేవా కార్య‌క్ర‌మాల్లో కొన్ని ల‌క్ష‌ల మందికి స్ఫూర్తి ప్ర‌ధాత‌గా నిల‌చిన జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి 47వ జ‌న్మ‌దిన వేడుక‌లు సెప్టెంబ‌ర్ 2వ తేదీన అట్లాంటాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి.. ఎముక లేని చేతితో తాను సేవ చేస్తూ, ల‌క్ష‌లాది మందిని సేవా మార్గం వైపు న‌డిపించిన శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి జ‌న్మ‌దినాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు, జ‌న‌సైనికులు వ‌ర‌ల్డ్ స‌ర్వీస్ డే(ప్ర‌పంచ సేవా దినోత్స‌వం)గా జ‌రుపుకుంటూ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.. అందిరితో పాటు యావ‌త్ జ‌న‌సైనికుల‌కి మ‌ద్ద‌తుగా, పార్టీ విస్తృతికి మేముసైతం అంటూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఆర్ఐ జ‌న‌సేన విభాగం త‌రుపున ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశాము..
జ‌న‌సేన పార్టీకి చెందిన అతిర‌ధులు, తెలుగు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు జ‌న‌సేనుడితో ప‌దం క‌లిపి ఉద్దానం కిడ్నీ బాధితుల‌కి ఊపిరులూద‌డానికి త‌మ‌వంతు కృషి చేస్తున్న ఉద్దానం డాక్ట‌ర్స్ టీం స‌భ్యులు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జ‌న‌సేన ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా విచ్చేయుచున్నారు.. అట్లాంటాలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన మా ఆరాధ్య దైవం, జ‌న‌సేన అధినేత జ‌న్మ‌దిన వేడుకల‌కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌న‌సైనికుల‌కి, పార్టీ సానుభూతిప‌రుల‌కి, వీర మ‌హిళ‌ల‌తో పాటు ఉత్త‌ర అమెరికాలో ఉన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి ప్ర‌త్యేకంగా స్వాగ‌తం ప‌లుకుతున్నాం.. ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ ఆహ్వానితులే.. జైహింద్‌…
                      ఇట్లు
అట్లాంటా ప్రవాస జనసేన కార్యకర్తలు
Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →