Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Power Star New Movie Story Leak..?

By   /  August 9, 2016  /  Comments Off on Power Star New Movie Story Leak..?

    Print       Email

pawan kalyan 2పవన్ సినిమా స్టోరీ లీక్..?

 
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన పవన్ కల్యాణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా విషయంలో జరిగిన హంగామా అంతా ఇంతాకాదు.ఈ మూవీ డైరెక్టర్ విషయంలోనూ.. హీరోయిన్ విషయంలోనూ మంచి సస్పెన్సే నడిచింది. అయితే డైరెక్టర్ గా డాలీ వచ్చారు.పవన్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ రెండోసారి అవకాశం దక్కించుకుంది.’కడప కింగ్’ పేరుతో ఈ సినిమా ప్రచారంలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా స్టోరీ లీక్ అంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ సినిమా స్టోరీ ఇదేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ స్టోరీ లైన్ హల్ చల్ చేస్తోంది.

InCorpTaxAct
Suvidha

పవన్ కల్యాణ్ కడపకు చెందిన ఓ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడరట. అతను కుర్రాడిగా ఉన్నప్పుడు ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అయితే అతని ప్రేమ సక్సెస్ కాదు. దీంతో హీరో బ్రహ్మచారిగానే ఉండిపోతాడట. కొంత కాలం తర్వాత పవన్ కు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పవన్ ఆలోచనా విధానాన్ని మార్చి.. తనను ప్రేమించేలా చేసుకుంటుందట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందట.

ఇదే పవన్ సినిమా స్టోరీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ముమ్మర ప్రచారం జరుగుతోంది.ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగస్ట్ నెలాఖరు నుంచి శృతిహాసన్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →