Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Prabhas Brother Prabodh gets 1 year Jail Term

By   /  March 17, 2016  /  Comments Off on Prabhas Brother Prabodh gets 1 year Jail Term

    Print       Email

prabas brother uppalapati prabodh 1 year prision 2

ప్రభాస్ సోదరుడికి ఏడాది జైలు శిక్ష..

InCorpTaxAct
Suvidha

 

చెక్స్ బౌన్స్ కేసులో ప్రముఖ హీరో ప్రభాస్ బ్రదర్ ఉప్పలపాటి ప్రభోద్ కు ఏడాది పాటు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఆయనకు హైదరాబాద్ రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాకి ప్రభోద్ నిర్మాతగా వ్యవహరించారు.ఆ సినిమా నిర్మాణ సమయంలో ప్రభోధ్.. గంగా గనాతే అనే మహిళ దగ్గర రూ.43 లక్షల అప్పుగా తీసుకున్నారు. ఆ మహిళ అప్పు తీర్చాలని ప్రభోద్ ని పలుమార్లు కోరింది. ఇందులో భాగంగా ఈ అప్పు తీర్చడానికి గాను రూ.43 లక్షలకు సంబంధించిన ఒక చెక్ ను ఆ మహిళకు ప్రభోద్ ఇచ్చాడు. అయితే, అకౌంట్ లో డబ్బు లేనందువల్ల ఈ చెక్ బౌన్స్ అయింది.

ఈ విషయాన్ని ఆ మహిళ చాలాసార్లు ప్రభోద్ కి వివరించింది.అయినా అతను స్పందించలేదు. ఎంతకీ తన చేతికి డబ్బు రాకపోవడంతో సదరు మహిళ 2013లో కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది. నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధించింది. దీంతో పాటు బాధితురాలికి నష్టపరిహారం కింద రెండు నెలల్లో రూ.87 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనగర్ రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ సీవీపీఎస్ ఛార్లెస్ తీర్పు చెప్పారని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →