Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Prakash Raj files defamation case against Pratap Simha

By   /  February 28, 2018  /  Comments Off on Prakash Raj files defamation case against Pratap Simha

    Print       Email

బీజేపీ ఎంపీ పై ప్రకాశ్ రాజ్ ప‌రువు న‌ష్టం దాఖ‌లు

 

InCorpTaxAct
Suvidha

 

 

కర్ణాటకలోని మైసూరు-కొడుగు పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మీద ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ మంగళవారం పరువు నష్టం దావా వేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తన పరువు తీసే విధంగా సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ తనను విమర్శించారని, లేనిపోని ఆరోపణలు చేశరాని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ మంగళవారం మైసూరు కోర్టును ఆశ్రయించారు.

నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు చేశారు. ప్రకాష్ రాజ్ మోడీని ప్రశ్నించడంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రకాష్ రాజ్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు. కొడుకు చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా ప్రకాష్ రాజ్ ఓ డ్యాన్సర్ తో పారిపోయి చిందులు వేశాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్టు చేశారని, అందుకే ఆయనపై ఒక్క రూపాయి పరువు నష్టం దావా వేసినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →