Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Prakash Raj fires on Central Minister

By   /  January 21, 2018  /  Comments Off on Prakash Raj fires on Central Minister

    Print       Email

కేంద్రమంత్రిపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఈ మద్య విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లో తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా హెగ్డేపై విమర్శలు చేస్తున్న ప్రకాశ్‌రాజ్.. దళితులను కించపరిచేలా మాట్లాడిన హెగ్డేపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. నేను చాలా ముక్కుసూటి మనిషిని. నా అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడను. యువతలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వారు స్వతంత్రంగా ఎదిగేందుకు సహాయం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేయడానికి, దేశాన్ని నైపుణ్య భారత్‌గా మర్చడానికి నేనిక్కడ ఉన్నాను. మేము ఈ నిబద్ధతతో ముందుకు వెళ్తున్నాం. మొరుగుతున్న వీధి కుక్కల గురించి పట్టించుకోం అని హెగ్డే వ్యాఖ్యానించారు. హెగ్డే వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. చాలు చాలు.. తీవ్రంగా ఖండిస్తున్నా. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు అనంత్ కుమార్ హెగ్డే దళితులను కుక్కలు అన్నారు. అతన్ని పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ సుప్రీం నాయకులు వెంటనే ఆదేశించగలరా.. లేదంటే ఆయన తప్పుచేసినట్లు మీరు అంగీకరించగలరా.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →