Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Pratyusha Banerjee Suicide: Rahul Raj Singh Arrested

By   /  April 2, 2016  /  Comments Off on Pratyusha Banerjee Suicide: Rahul Raj Singh Arrested

    Print       Email

Rahul-Raj new

ప్రత్యూష బెనర్జీ లవర్ అరెస్ట్..

InCorpTaxAct
Suvidha

 

 

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ ఫేం ప్రత్యూష బెనర్జీ సూసైడ్ కేసులో ముంబై పోలీసులు ఆమె లవర్ రాహుల్‌ రాజ్‌ సింగ్‌ను ప్రశ్నించారు. విచారణ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతి చెందిందని పోలీసులకు, ఆమె కుటుంబసభ్యులకు స్వయంగా రాహుల్‌ రాజ్‌ తెలియజేశాడు.. ముందుగా పోలీసులు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించారు. శనివారం అతన్ని అదుపులోకి తీసుకుని మళ్ళీ ప్రశ్నించారు. అయితే ప్రత్యూష మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రత్యూష బెనర్జీ శుక్రవారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెది ఆత్మహత్య కాదని.. ఆమె సన్నిహితులు అంటున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ రాజ్‌తో సంబంధాల్లో ప్రత్యూషకు కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం. నిన్న ఉరి వేసుకొని ఉన్న ప్రత్యూషను రాహల్‌ రాజ్‌ కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని రాహల్‌ రాజే స్వయంగా పోలీసులకు, ప్రత్యూష బంధువులకు సమాచారం అందించాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →