Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘Premante suluvu kadura’ movie sensor completed..

By   /  March 23, 2016  /  Comments Off on ‘Premante suluvu kadura’ movie sensor completed..

    Print       Email

premante suluvu kadura

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ప్రేమంటే సులువు కాదురా’..
రాజీవ్‌ – సిమ్మీ దాస్‌ జంటగా నటిస్తున్న మూవీ ‘ప్రేమంటే సులువు కాదురా’. ఆర్‌.పి. ప్రొడక్షన్స్ బ్యానర్ పై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి చందా గోవింద్‌రెడ్డి దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు పూర్తైపోయాయి. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా సెన్సార్‌ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీకి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌తో పాటు, సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు కూడా లభించాయని డైరెక్టర్ గోవింద్‌రెడ్డి తెలిపారు.

InCorpTaxAct
Suvidha

ఈ సినిమా గురించి దర్శకుడు గోవింద రెడ్డి మాట్లాడారు. కథ, కథనం, సంభాషణలు, పాటలు, నేపథ్య సంగీతం, హీరో హీరోయిన్‌ల నటన.. తమ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు అని అన్నారు. ‘ప్రాణం’ కమలాకర్‌ అందించిన నేపథ్య సంగీతం, ఉద్ధవ్‌ ఎడిటింగ్‌ సినిమాకు బాగా ఉపయోగపడతాయన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని చెప్పారు. కాశీవిశ్వనాథ్‌, మధుమణి, చమ్మక్‌ చంద్ర, చలాకీ చంటి, వైజాగ్‌ అప్పారావు, టార్జాన్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: కృష్ణ మాదినేని, సంగీతం: నందనరాజ్‌, ఛాయాగ్రహణం: సురేశ్ రఘుట, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి, శ్రీపతి శ్రీరాములు, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: చందా గోవింద్‌రెడ్డి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →