Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

President Pranab Mukherjee

By   /  June 11, 2016  /  Comments Off on President Pranab Mukherjee

    Print       Email

The President, Shri Pranab Mukherjee addressing the Nation on the eve of the 64th Republic Day, in New Delhi on January 25, 2013.

ఏపీ ‘స్థానికత’కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం

InCorpTaxAct
Suvidha

 

 

 

స్థానిక‌త‌కు సంబంధించి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆమోదం ల‌భించింది. శుక్ర‌వారం గెజిట్ కూడా వెలువ‌డింది. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అమరావతి వెళ్ళాలంటే స్థానికత సంగతి ఏంటో తేల్చాలని ఉధ్యోగ సంఘాలు గ‌త ఏడాదికి పైగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉన్నాయి. దీనిపై స్థానికతకు సంబంధించి అడ్డంకులను తొలగించాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు గత అక్టోబర్‌లో కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సుమారు 8 నెలల కసరత్తు తర్వాత స్థానికతపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. కాగా కేంద్రం నిర్ణ‌యాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేశారు. ఇన్ని రోజులు ఉద్యోగులు లేవ‌నెత్తుతున్న `స్థానిక‌త‌` స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింది. ఇక 2017 జూన్ 2 నాటికి ఎవరైతే ఏపీకి వెళ్లి స్థిరపడతారో వారంతా స్థానికుల కిందే పరిగణనలోకి తీసుకుంటారు.

కాగా గత సోమవారం  కేంద్రం ఈ ఫైల్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపగా శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్ జారీ అయ్యింది.  దీంతో ఉద్యోగులు అమరావతికి వెళ్లుందుకు సర్కారు ముందు పెట్టిన చాలా డిమాండ్లు పరిష్కారం అయినట్లే భావిస్తున్నారు. ఇఫ్పటికే 30 శాతం హెచ్ ఆర్ ఏ జీవో జారీ చేశారు. గతంలోనే  ఐదు రోజుల పనిదినాలకు ఆమోదం తెలిపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక‌త‌పై  స్ప‌ష్టత రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా ఊపిరి పీల్చుకున్న‌ట్ల‌యింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →