బలహీన వర్గాలపై దాడులు దేశ సంస్కృతికి వ్యతిరేకం: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
దేశ సంస్కృతికి.. బలహీన వర్గాలపై దాడులు వ్యతిరేకమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని ఈ సందర్భంగా అన్నారు. దేశ ప్రజలకు ఆయన 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారత్ డెమోక్రటిక్ కంట్రీగా నిలదొక్కుకుంటుందని ఎవరూ నమ్మలేదని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేసి కష్టాలకు ఓర్చి స్వాతంత్య్రం సాధించిన వీరులను ఎప్పుడూ గౌరవించాలని తెలిపారు. మనల్ని మనం ప్రశ్నించుకుంటూ శాస్త్రీయ దృక్కోణం పెంచుకోవాలని సూచించారు.
భద్రత విషయంలో సమగ్ర చర్చ అవసరం..
దేశ భద్రత విషయంలో అందరూ కలిసి సమగ్రంగా చర్చించాలని సూచించారు. అందరూ కలిసి సమైక్యంగా పోరాడాలన్నారు. దేశ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బలహీన వర్గాలపై దాడులు దేశ సంస్కృతికి తీవ్ర వ్యతిరేకమన్నారు. అలా చేయడం సరికాదని తెలిపారు. దేశ ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అత్యంత శుభసూచకమని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని స్పష్టం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.