Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pricey ‘Pulasa’ fish is now everyone’s favorite

By   /  July 26, 2016  /  Comments Off on Pricey ‘Pulasa’ fish is now everyone’s favorite

    Print       Email

pulasa`పుల‌స‌` వ‌చ్చేసింది

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల ప్ర‌జ‌ల‌కు పులస ఫీవర్ పట్టుకుంది. ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే లభించే ఈ పులస చేప సీజన్ వచ్చేసింది. కేవలం జూలై, ఆగస్టు మాసాల్లో లభించే ఈ అరుదైన చేప అంటే మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. మాంసాహారంలోనే ఈ పులస చేపలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు మాంసాహారంలో చేపల పులుసుకు ప్రత్యేక స్థానముంటే చేపల పులుసులో ఈ పులస వంటకం ఎంతో ప్రత్యేకం. ఏపీలో కేవలం ఉభయ గోదావరి జిల్లాలో అరుదుగా లభించే ఈ సీజనల్ ఫిష్‌ను ఇప్పుడు రుచి చూసేందుకు రాష్ట్రంలోని మాంసాహారులు ఆయా జిల్లాకు బారులు తీరుతున్నారు. గోదావరిలో నిగనిగలాడే వెండి చేప వలకు దొరికితే నిధి దొరికినట్లేనని మత్స్యకారులు భావిస్తారు. పులస చేపను పట్టడం ఒక అన్వేషణగా భావిస్తారు. వరద రూపంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి రాగానే ఇది ఇలసగా మారుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజీనియా నుంచి ఈ పులస చేప వలస వచ్చింది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ జాతీయ ఫిష్‌గా ఈ పులస చేప ఉంది.

పులస చేప ప్రత్యేక ఏంటంటే గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి ఎదురీదుతుంది. గుడ్లు పెట్టిన అనంతరం అక్టోబర్లో తిరిగి వెళ్లిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజి దిగువున మాత్రమే ఈ పులస చేపలు దొరుకుతాయి. గోదావరి తీపి నీటితో పులస రంగు రుచి మారిపోతుంది. వలలో పడిన అనంతరం చనిపోయినా రెండు రోజులు తాజాగా ఉంటుంది. పులస చేపల్లో పోతుపులస, శనపులస అని రెండు రకాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆడ పులస ధర, రుచీ రెండూ ఎక్కువగా ఉంటాయి. పుల‌స కిలో రూ.4000ల నుంచి రూ.5000ల వ‌ర‌కు ప‌ల‌క‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →