Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Prince Mahesh Babu Family visits Burripalem Village

By   /  March 17, 2016  /  Comments Off on Prince Mahesh Babu Family visits Burripalem Village

    Print       Email

mahesh family members 2

బుర్రిపాలెం గ్రామాన్ని సందర్శించిన శ్రీమంతుడు ఫ్యామిలీ..

InCorpTaxAct
Suvidha

 

శ్రీమంతుడు సినిమాలో చూపించినట్లుగా ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇంచుమించు ఏడాది క్రితమే దత్తత తీసుకున్నా.. కొన్ని కారణాల వల్ల అటువైపు తొంగిచూడలేదు. తాజాగా ఆయన బుర్రిపాలెం గ్రామం అభివృద్దికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయన సతీమణి నమ్రత, సోదరి గల్లా పద్మా గ్రామాన్ని సందర్శించారు. వీరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించిన నమ్రత, పద్మ… కృష్ణ నిర్మించిన గీతామందిరంలో పూజలు నిర్వహించారు. తర్వాత గ్రామంలోని స్కూల్‌ను పరిశీలించారు. దత్తత గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థులు, అధికారులతో చర్చలు జరిపారు.మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ తమ గ్రామానికి రావడం పట్ల బుర్రిపాలెం గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీమంతుడు సినిమాలో మహేష్ ఓ మేసేజ్ ఇచ్చారు. ఊరి నుంచి చాలా తీసుకున్నారు.. తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు.. అంటూ డైలాగ్ చెప్పారు. కేవలం డైలాగ్ తోనే సరిపెట్టకుండా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు గ్రామాన్ని దత్తత తీసుకున్నామని ఏడాదిక్రితమే ఆయన ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన అటువైపు దృష్టి సారించలేకపోయారు. తాజాగా ఆయన గ్రామాభివృద్ధిపై ప్రణాళికు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు గ్రామంలో పర్యటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →