Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Priyamani fires on vijay..

By   /  August 8, 2016  /  Comments Off on Priyamani fires on vijay..

    Print       Email

Amala Paul- Vijay 1విజయ్ పై మండిపడుతున్న హాట్ భామలు..?

 

InCorpTaxAct
Suvidha

 

తన అందచందాలతో అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది అమలాపాల్. తర్వాత ఈ బ్యూటీ ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే కొంత బ్రేక్ తర్వాత అమలాపాల్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అదే ఈ దంపతుల మధ్య కలతలకు కారణమైంది. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకుని నూరేళ్ళ సంసారానికి గుడ్ బై చెప్పేశారు.

ఈ నవదంపతులు విడాకులు వరకు వెళ్లడానికి కారణం.. అమలా మళ్ళీ సినిమాల్లో నటించడమేనట. ఆమెను సినిమాల్లో నటించవద్దని విజయ్ అతని కుటుంబసభ్యులు తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారట. అంతేనా.. కొంతమంది హీరోలతో సంబంధాలు కూడా అంటగట్టారట. ఇలా ఈ అందాలతారను విజయ్ ఫ్యామిలీ చిత్ర హింసలకు గురిచేసిందని.. ఆమె స్నేహితులు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే విజయ్ తండ్రి వాదన మరోలా ఉంది. అమలాపాల్ పెళ్లైన తర్వాత ఏ సినిమాలోనూ చేయనని చెప్పిందని తెలిపారు. తమ కుటుంబంలో ఎవరికి ఆమె కనీస మర్యాద కూడా ఇచ్చేది కాదని ప్రకటించారు. ఈ నవదంపతులు పబ్లిక్ గా తాము విడిపోతామంటూ ప్రకటించడమే కాకుండా.. కోర్టుకు కూడా వెళ్ళారు.

దీనిపై సినీ రంగానికి చెందిన కొంతమంది హీరోయిన్లు మండిపడుతున్నారు. సినిమాల్లో నటించాలని అనుకునే హీరోయిన్లు పెళ్ళికి దూరంగా ఉంటేమంచిదని సూచిస్తున్నారు. హీరోయిన్ల వ్యక్తిగత స్వేచ్ఛపై వారి భర్తల పెత్తనమేంటని ప్రియమణి, మమతా మోహన్ దాస్ వంటి వారు ప్రశ్నిస్తున్నారు. ‘ఇది చాలా దారుణమైన విషయం. పెళ్లైనంత మాత్రాన ఓ మహిళ తన జీవితాన్ని ఎంచుకునే హక్కును ఎలా కాలరాస్తారు?’ అంటూ ఈ హాట్ భామలు ప్రశ్నిస్తున్నారు. అమలాపాల్‌ను కేవలం కిచెన్ కి పరిమితం చేయాలనుకోవడం విజయ్ అండ్ ఫ్యామిలీకి తగదని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →