Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Puducherry CM Narayanaswamy victory in bypoll..

By   /  November 22, 2016  /  Comments Off on Puducherry CM Narayanaswamy victory in bypoll..

    Print       Email

puducherry-cm-narayana-swamy-victory-2ఉప ఎన్నికలో పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి విజయం..

 

InCorpTaxAct
Suvidha

 

 

పుదుచ్చేరి శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న వి. నారాయణ స్వామి ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. నెల్లితోప్ నియోజక వర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు. ఆయనపై ఏఐడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్‌ పోటీ చేశారు. ఆసక్తికరంగా సాగిన వీరి పోరులో నారాయణ స్వామి ఏకంగా 11,144 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు.

 

సీఎం నారాయణ స్వామికి 18,709 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి ఓంశక్తి శేఖర్‌కు 7,565 ఓట్లు వచ్చాయి. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా నారాయణ స్వామి గెలుపు తప్పనిసరి అయింది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయన బై పోల్ లో పోటీచేసేందుకు వీలుగా నెల్లితోప్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ.జాన్ కుమార్ రాజీనామా చేశారు. అయితే.. గతంలో కుమార్‌పై పోటీ చేసినప్పుడు 6,365 ఓట్లు మాత్రమే దక్కించుకున్న శేఖర్‌కు తాజా ఎన్నికల్లో 1200 ఓట్లు అధికంగా రాబట్టుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →