Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

అంద‌రి దృష్టి ఆ గ్రామంపైనే

By   /  April 29, 2016  /  Comments Off on అంద‌రి దృష్టి ఆ గ్రామంపైనే

    Print       Email

tdp ycp logosఆ గ్రామంలో జ‌రిగ‌బోయే ఉప ఎన్నిక‌ను ప్ర‌ధాన పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. ఆ సీటును గెలిచేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆ గ్రామ వాసులు అడిగిందే త‌డువు ఏ ప‌నైనా చేసేస్తున్నారు. నిధులు విచ్చ‌ల‌విడిగా విడుద‌లు చేస్తూ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. పెద్ద పెద్ద నాయ‌కులే ద‌గ్గ‌రుండి ప‌నులు చేపిస్తూ ఇంకేం కావాలో అడ‌గ‌మ‌ని అంటున్నారు. ఆ గ్రామం ఏదీ.. ఎన్నిక ఏంటి అనుకుంటున్నారా? అయితే చ‌ద‌వండి…. పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలం బలపనూరు.. అక్కడ గ్రామ పంచాయతీకి ఉప ఎన్నిక జరుగుతోంది. అది దివంగత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్వగ్రామం. అందుకే అక్కడి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  2200 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో ప్ర‌తి ఓటు కీల‌కంగా మార‌నుంది.

బలపనూరులో మొదటినుంచి  వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన వ్యక్తే ఆ గ్రామానికి సర్పంచ్ గా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ… ఇప్పటిదాకా అసలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకే దిగలేదు. వైఎస్ మరణం తరువాత కూడా 2013లో జగన్ కుటుంబం మద్దతు పలికిన సరస్వతమ్మ విజయం సాధించారు. అయితే ఆమె ఇటీవలే చనిపోయారు. ఈ క్రమంలో వైఎస్ సొంతూళ్లో పసుపు రంగు జెండా ఎగురవేయాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. అసలే ఎమ్మెల్యేలను కోల్పోతున్న సమయంలో సొంతూళ్లో సర్పంచి పదవి కూడా తమకు దక్కకపోతే అది తీరని అవమానం అవుతుందని భావిస్తున్న జ‌గ‌న్ కూడా ఈ ఎన్నిక‌ను చాలెంజ్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →