ఐపీఎల్ అదుర్స్
ప్రారంభమ్యాచ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయిన పుణె సూపర్‌జెయింట్స్
సొంతగడ్డపై చతికిలపడిన ముంబై ఇండియన్స్
రాణించిన రహానె
తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న పుణె సూపర్‌జెయింట్స్
ఐపీఎల్ 9వ సీజన్లో ఎవరూ ఊహించని పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన గత టైటిల్ విజేత ముంబయి ఇండియన్స్ సొంత గడ్డపై చతికిల పడగా ఎవరూ ఊహించిన విధంగా మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని పుణె సూపర్‌జెయింట్స్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. అంతేకాదు 9 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను మట్టి కరిపించింది. 122 పరుగుల లక్ష్యాన్ని 14.4 ఓవర్లలోనే, ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్లో ఏ టీంను తక్కువ అంచనా వేయడానికి లేదని మరోసారి రుజువైంది. కాగా 66 పరుగులు చేసిన రహానె మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
పుణె జట్టు స్కోర్ వివరా
అజింక్య రహానె (66 నాటౌట్; 42 బంతుల్లో 7×4, 3×6) తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం సాధించగా.. డుప్లెసిస్ (34; 33 బంతుల్లో 1×4, 3×6), కెవిన్ పీటర్సన్ (21 నాటౌట్; 14 బంతుల్లో 2×6) తమ బ్యాట్ల పదును చూపించారు. అంతకుముందు ముంబయిని పుణె బౌలర్లు 121/8కే కట్టడి చేశారు. హర్భజన్ (45 నాటౌట్; 30 బంతుల్లో 7×4, 1×6) పోరాడకుంటే ముంబయి కనీసం వందైనా చేసేది కాదు. ఏది ఏమైనా పరుగుల వరద పారుతుందనికుంటే అలాంటిదేమీ లేకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.