Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Purandeswari says AP will not get special status

By   /  August 15, 2016  /  Comments Off on Purandeswari says AP will not get special status

    Print       Email

purandeswariఏపీకి ప్ర‌త్యేక హోదా రాదు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన నేప‌థ్యంలో రాష్ట్రంలోని కొంత‌మంది బీజేపీ నేత‌లు కూడా అదే విష‌యాన్ని చెబుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కులు పురందేశ్వ‌రి ఒక‌డుగు ముందుకేసి ఏపీకి ప్ర‌త్యేక హోదా రాదంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. అంతేకాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహ‌ద ప‌డ‌డానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నార‌ని, ఇప్ప‌టికే రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చార‌ని కూడా అంటోంది. సీఎం చంద్ర‌బాబు సొంత‌జిల్లాలో నిర్వ‌హించిన పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పురందేశ్వ‌రితో మీడియా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందువల్ల ఈ హోదా కల్పించడం సాధ్యం కాద‌న్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాయని, ఈ రాష్ట్రాలను ఒప్పిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్దమేనని తెలిపారు. ఈదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ చూపితే ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కే అవకాశం ఉందని పురందీశ్వ‌రి న్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా గౌర‌వం ద‌క్కించే విషయంలో కొందరు అవగాహన లేకుండా కేంద్రంపై విమర్శలు చేయడం దారుణమని పురందేశ్వ‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నాబార్డు ద్వారా నాలుగు వేల కోట్లను కేటాయించిందని. ఈనిధులు పూర్తిగా కేంద్రమే భరిస్తుందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదన్నారు. హోదా విషయంలో అనేక సాంకేతిక సమస్యలు వున్న విషయాన్ని అందరూ గుర్తించి రాష్ట్రాభివృద్ధికి ఏమి కావాలో ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. పురందేశ్వ‌రి మాట‌లు చూస్తా ఉంటే ఒక విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాదు.. ప్యాకేజీకి ప్ర‌య‌త్నం చేయండి అని అన్ని పార్టీల‌కు ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →