Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Purandeswary Warned TDP Government

By   /  January 6, 2018  /  No Comments

    Print       Email

ఇలా అయితే టీడీపికి కష్టాలు తప్పవు : బీజేపీ నేత పురంధేశ్వరి

 

Suvidha
Biryani Pot

 

 

 

తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. పరిపాలన విషయంలో తప్పులు చేస్తున్న టీడీపీ, ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో కష్టమేనని బీజేపీ నేత పురంధేశ్వరి హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. టీడీపీ ప్రభుత్వం చేసే తప్పులను కేంద్రానికి ఆపాదించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు 80 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని.. అయినా కూడా ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను అందించడం లేదని ఆమె దుయ్యబట్టారు.

కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీలు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నాయి. నిధుల కేటాయింపులకు సంబంధించి అనేక ఆరోపణలు తమ వరకు వచ్చాయని చెప్పామని ఈ విషయాలన్నింటినీ కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళతామన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TDF Atlanta Bathukamma & Dasara Sambaralu-2018

Read More →