పూరీ..కల్యాణ్‌రాం `ఇజం`
హీరోను చాలా గొప్పగా చూపించే దర్శకుల్లో ప్రముఖదర్శకుడు పూరీ జగన్నాథ్ ముందు వరుసలో ఉంటాడు. అయితే చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా పెద్దగా హిట్స్‌లేని కల్యాణ్‌రామ్‌కు పూరీ జగన్నాథ్ ఈసారి బంపర్ హిట్ ఇవ్వాలనుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషనల్లో ఓ సినిమా రాబోతోంది. కల్యాణ్‌రామ్ కథానాయకుడుగా, ఆయనే నిర్మాత వస్తున్న ఈ చిత్రానికి `ఇజం` అని పేరు పెట్టారు.
నేడు కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘ఇజం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్నీ విడుదల చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 9 నుంచి నెలాఖరు వరకూ స్పెయిన్‌లో కీలక సన్నివేశాల్ని, పాటల్ని తెరకెక్కిస్తారు. సెప్టెంబరు 29న ‘ఇజం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ‘ఇజం’ మరో ఎత్తు. కమర్షియల్ సినిమానే ఓ కొత్త కోణంలో చూపిస్తున్నార’’న్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌ని చాలా కొత్తగా చూపిస్తున్నాం. జర్నలిస్టు పాత్రలో అతని నటన ఆకట్టుకొంటుంద’’న్నారు పూరి జగన్నాథ్. అతిథి ఆర్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రధారి. అనూప్ సంగీతం అందించనున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.