Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Puri casting call for Balakrishna movie..!

By   /  March 1, 2017  /  Comments Off on Puri casting call for Balakrishna movie..!

    Print       Email

Puri casting callబాలయ్య మూవీ కోసం పూరి కాస్టింగ్ కాల్..

 

InCorpTaxAct
Suvidha

 

 

నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో సూపర్ హిట్ కొట్టారు. అదే జోష్ తో నెక్ట్స్ మూవీకి రెడీ అయిపోయారు. అంతేకాదు తదుపరి చిత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఉంటుందని కూడా చెప్పేశారు. అయితే ఈ చిత్రానికి గాను పూరీ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. అదేంటి అని ఆశ్చర్యపోకండి. అదే పూరీ జగన్నాథ్ స్టైల్ అంటే. ఎందుకంటే ఆయన సీనియర్ యాక్టర్ తో సినిమా తీసేటప్పుడు క్యారెక్టర్లు వాటి యాక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీలైనంత వరకు క్యారెక్టర్ కి సూట్ అయ్యేవారినే సెలెక్ట్ చేసుకుంటారు. దీనికోసమేనేమో ఆయన కాస్టింగ్ కాల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ జనాలు అనుకుంటున్నారు.
తాజాగా పూరీ.. హీరోయిన్లు, విలన్, ఇతర పాత్రల కోసం కాస్టింగ్ ప్రకటన ఇచ్చేశాడు. చార్మితో కలిసి ఏర్పాటు చేసిన పూరీ కనెక్ట్స్ ద్వారా ఈ ప్రకటన జారీ చేశాడు. వారికి కావాల్సిన అర్హతలను అందులో తెలియజేశారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయనున్నారు. ఇద్దరి వయసు 23 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుండాలని కండీషన్ పెట్టారు. విలన్‌ గా నటించాలని అనుకునేవారు ఏకంగా ఆరు అడుగులు ఉండాలట.వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలట.అలాగే రాజకీయ నాయకుడిగానూ ఓ వ్యక్తి కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →