Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Puri Jagannath Movie with Kalyan Ram

By   /  February 5, 2016  /  Comments Off on Puri Jagannath Movie with Kalyan Ram

    Print       Email

kalyan ramపూరి- కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో మూవీ..!

 

InCorpTaxAct
Suvidha

ఢిపరెంట్ మూవీస్ లో నటించి విజయాలు అందుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.అలాగే బద్రి నుంచి లోఫర్ వరకు సక్సెస్ ఫుల్ సినిమాలు తెరక్కెక్కించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రాబోతోంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దీనికి ముందు టెంపర్ లాంటి బంపర్ హిట్ ఇచ్చారు పూరి.ఇక కళ్యాణ్ రామ్ కూడా పటాస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు.దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ నందమూరి అందగాడు.. సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారని సమాచారం.

 

పూరి జగన్నాథ్.. కళ్యాణ్ రామ్ కి నప్పే కథను రెడీ చేశారు.ప్రెస్టిజియస్ మూవీగా రూపొందనున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్,డైరెక్షన్ పూరి జగన్నాథ్.ఇతర పాత్రల కోసం త్వరలోనే నటీ నటులను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.రీసెంట్ గా పటాస్ హిట్ తో మంచి హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్నిక్రియేట్ చేసుకోగలిగారు.అలాగే పటాస్ లాంటి సినిమా నిర్మాణంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా మారారు.దీంతో పూరి-కళ్యాణ్ మూవీపై ఇప్పటినుంచే అభిమానులు భారీ ఆశలు పెట్టేసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →