రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కు తగ్గని దర్శకుడు ..?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్.. ఈ మధ్య ప్లాపుల నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తన స్థాయికి తగిన సినిమా కాకపోయినా ‘జ్యోతి లక్ష్మి’ని తెరకెక్కించారు. అయినా పెద్దగా సక్కెస్ దక్కలేదు. తర్వాత వరుణ్ తేజ్ తో తీసిన ‘లోఫర్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.అయినా ఈ దర్శకుడు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రెట్టించిన స్పీడ్ తో దూసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని ప్లాపులు వచ్చినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదట.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పూరి ‘ఇజం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే నెలాఖరుకల్లా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు పూరి ఏకంగా 8 కోట్ల మేర పారితోషకం తీసుకుంటున్నాడట. ‘ఇజం’ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దీని బడ్జెట్ 20 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇందులో మేజర్ వాటా పూరి జగన్నాథ్ దేనని గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ‘టెంపర్’ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా పూరి రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ సినిమాతో అయినా పూరి మంచి సక్సెస్ సాధిస్తాడా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.