‘రోగ్’ సినిమాని డైరెక్ట్ చేస్తున్న పూరి జగన్నాథ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. అలాగే నందమూరి అందగాళ్లతో తర్వాత సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించనున్న మూవీకి ‘రీమిక్స్’ అని టైటిల్ పెట్టబోతున్నారని టాలీవుడ్ టాక్. ఈ మూవీలో హీరోయిన్ గా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలో నటించిన సురభిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగు తోంది. ఈ ముద్దుగుమ్మ రఘువరన్ బీటెక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. అంతేకాదు.. సందీప్ కిషన్ నటించిన ‘బీరువా’ మూవీతో నేరుగా తెలుగు సినిమాలో కనిపించింది. ఆ సినిమా మాట ఎలా ఉన్నా కాని.. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో ఈ అమ్మడు మంచి హిట్ అందుకుంది. శర్వానంద్ – సురభి కాంబినేషన్ తెరపై చూడచక్కగా ఉందని ఓ టాక్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ అందాల తార పూరి కంట్లో పడింది. అందుకే తను కళ్యాణ్ రామ్ హీరోగా తీస్తున్న మూవీలో హీరోయిన్ గా సెలక్ట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ప్రెజెంట్ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్ లో ఉందని తెలుస్తోంది. త్వరలో పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తారని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.