కాంగ్రెస్‌కు పువ్వాడ ఝలక్!
తెంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని విపక్షాలు ఆలోచిస్తుంటే.. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. మొన్న డీకే అరుణ సోదరుడు, మత్కల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా తాజా ఖమ్మం జిల్లా బలమైన క్యాడర్ ఉన్న పువ్వాడ అజయ్ అధికార పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. దీంతో ఒకరొకరుగా కాంగ్రెస్ ను వీడుతుండడంతో ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్య అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తదుపరి నిర్ణయాలు ఏం తీసుకోవాలో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పాలేరు ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ కు ఈ వలసల ఎఫెక్ట్ బాగానే పడేటట్లు కనిపిస్తోంది.
వాస్తవానికి ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికి తుమ్మల ఆయన రాకను అడ్డుకున్నారు. ఇపుడు తుమ్మల తన మకాంను పాలేరుకు మారుస్తుం డడంతో పువ్వాడ అజయ్‌కి లైన్‌క్లియర్ అయిందని టిఆర్ఎస్ వర్గాలు అంటు న్నాయి. కార్పోరేషన్ ఎన్నికలలోను ఆయన పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో పనిచేయలేదన్న అపవాదు ఉంది. టిఆర్ఎస్ ప్లీనరీలోనే ఆయన పార్టీలోకి వస్తారని అందరు భావించినప్పటికి అందుకు ఒక్కరోజు ముందే తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన పార్టీలోకి జంప్ చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆయనతో చర్చించేందుకు ప్రయత్నిం చి విఫలమయ్యారని సమాచారం. ఒకరిద్దరు పోయినా పర్వాలేదని కాంగ్రెస్ పార్టీ బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం భయపడుతున్నట్లు తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.