Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Qatar Bollywood concert to feature Sunny Leone cancelled..

By   /  March 6, 2016  /  Comments Off on Qatar Bollywood concert to feature Sunny Leone cancelled..

    Print       Email

29-Sunny-Leone

సన్నీ పాల్గొంటారని అనుమతులు రద్దు చేశారట..!

InCorpTaxAct
Suvidha

 

ఖతార్ లో బాలీవుడ్ నైట్ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దీనికి కారణం సన్ని లియోన్ అని ప్రచారం జరుగుతోంది. సన్నీ పాల్గొనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పారట. దీంతో ఎంతో ఘనంగా నిర్వహించాలనుకున్న ఆ ప్రోగ్రాం రద్ద అయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ నెల 11న ఖతార్‌లోని ఏసియన్‌ టౌన్‌ ఆంఫీ థియేటర్‌లో బాలీవుడ్‌ నైట్‌ షో నిర్వహించాల్సిఉంది. దీనికిగాను అరుణ్‌ వాలే ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ భారీగా ఏర్పాట్లు చేసింది.ఆ కార్యక్రమంలో సన్నీలియోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. దీనికిగాను అక్కడి సాంస్కృతిక శాఖ నుంచి అనుమతు లు కూడా తీసుకున్నారట. ఈ షో కు సంబంధించి ఏకంగా 7 వేల టికెట్లు కూడా అమ్ముడు పోయాయి. అయితే.. తమ నియమ నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం జరగనుందన్న ఆరోపణలతో అనుమతులు రద్దు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారట. షోలో సన్నీలియోన్ పాల్గొంటే అనుమతించేది లేదన్నారట. దీంతో నిర్వాహకులు ఆ షోను రద్దు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపిందట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →