
వనభోజనాలలో రాగిసంగటి , అలసంద వడలు, సియ్యల పులుసు (Goat Curry), కోడి పులుసు (chicken curry), గ్రిల్ల్డ్ చికెన్ (Grilled Chicken), శనిక్కాయ ఊరిబిండి (Peanut/Groundnut Chutney), ఉర్లగడ్డ తాళింపు (Potato Fry), తిరవాత అన్నం (Pulaav Rice), చిత్రాన్నం (Lemon Rice), నూనె వంకాయ (Stuffed Eggplant Curry), శెనగబ్యాళ్ల పాయసంతో కూడిన మెనూను వడ్డించడం జరిగింది. అతిధులంతా వంటకాలన్నింటిని ఆస్వాదించి ప్రశంసించటం జరిగింది. భోజనాల తరువాత పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందచేయడం జరిగింది.
సాయంత్రం సమయానికి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాయలసీమ వారిచే నిర్వహించబడుతున్నా తెలుగు వారందరు కలిసి చేసుకొనే కార్యక్రమమని రాయలసీమ ఆచార వ్యవహారాలను భావితరాలకు అందిస్తూ తెలుగు వారందరికీ రాయలసీమను పరిచయం చెయ్యటమే పరమావధిగా జరుపుతున్న కార్యక్రమమని మనవి చేసుకున్నారు, పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ రాయలసీమ పండుగ వాతావరణాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని కోరటం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల నుండి ఈ మధ్యే కొడుకు దగ్గరికి వచ్చిన పెద్దాయన వంగల రెడ్డి గారు మాట్లాడుతూ సిద్ధేశ్వరం అలుగు కోసం ప్రజాసంఘాలు గత నెల చేప్పట్టిన శంకుస్థాపన కార్యక్రమం గురించి వివరించారు ప్రవాస రాయలసీమ వాదులు ఇందులో ఏదో విధంగా భాగస్వాములు కావలసిందిగా కోరటం జరిగింది. రాయలసీమ పై ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించటం జరిగింది ఇందులో భాగంగా రాయలసీమ వైభవాన్ని , విభజన తరువాత రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలను ఒక పవర్‌పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం జరిగింది.

జై రాయలసీమ … జై జై రాయలసీమ
ఫొటోస్
Facebook Photos :
Google Photos:
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.