Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Radha’s followers angry over Gautam Reddy

By   /  September 4, 2017  /  Comments Off on Radha’s followers angry over Gautam Reddy

    Print       Email

గౌతమ్ రెడ్డిపై రాధా అనుచరుల ఆగ్రహం..

 

InCorpTaxAct
Suvidha

 

 

వంగవీటి మోహనరంగా, రాధాల గురించి గౌతమ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై రాధా అనుచరులు స్పందించారు. గౌతమ్ రెడ్డడిని పార్టీనుంచి సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. రంగా ఇప్పటికీ హీరోనే అని అన్నారు. ఆయన ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నారని అంటున్నారు. రంగా, రాధాలపై కామెంట్ చేసిన గౌతమ్ రెడ్డి పెద్ద సత్యహరిశ్చంద్రుడా.. ? అంటూ ప్రశ్నించారు. ఆయనపై 17 మర్డర్ కేసుల్లో ఆరోపణలు ఉన్నాయన్నారు.

గౌతమ్ రెడ్డికి వైసీపీ ఎన్నో అవకాశాలను ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాక ఎన్నికల సమయంలో ఆర్థిక సాయం కూడా చేసిందన్నారు. అయినా ఆయన పార్టీ ఇచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. కార్పొరేటర్ అయిన గౌతమ్ రెడ్డి తన స్థాయి ఎరిగి ప్రవర్తించాలని సూచించారు. గౌతంరెడ్డికి రూ. 300 కోట్ల డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సత్యనారాయణపురంలోని పలువురి బ్రాహ్మణుల భూములను కబ్జాలు చేసి సంపాదించారని ఆరోపణలు గుప్పించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →