ఆస్ట్రేలియా బ్యాంకుపై ఓస్వాల్ దంపతుల ఆరోపణలు..!
భారత వ్యాపార దిగ్గజాలు పంకజ్, రాధిక ఓస్వాల్ ల రుణాల చెల్లింపు వివాదం మరో మలుపు తిరిగింది. వీరికి చెందిన బర్రఫ్ ఫెర్టిలైజర్ ను రుణాల చెల్లింపు వివాదంలో ఏఎన్జెడ్ బ్యాంకు స్వాధీనం చేసుకుని విక్రయించింది. అయితే దాన్ని ఏఎన్జెడ్ తక్కువ ధరకు విక్రయించారని ఓశ్వాల్ దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
విక్టోరియా సుప్రీంకోర్టు తా[జా విచారణ సందర్భంగా రాధిక ఓస్వాల్ ఏఎన్జెడ్పై సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. తన వాటాకు సంబంధించి గ్యారెంటీ, మార్టిగేజ్‌పై సంతకం చేయాలంటూ ఏఎన్జెడ్ ఎగ్జిక్యూటివ్ తనపై తీవ్రమైనఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే తమ కుటుంబం మొత్తం అనాధలు అవుతారని బ్యాంకు చీఫ్ లీగల్ ఆఫీసర్ బాబ్ శాంటామారియాబెదిరించారని న్యాయస్థానానికి విన్నవించారు.
తన భర్త రుణాలతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకోలేదన్నారు. 2009లో వారితో ఓ మీటింగ్ జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు తమను బెదిరించారని తెలిపారు. మీరిద్దరూ జైలుకు వెళ్తారని.. పిల్లలు అనాథలు అవుతారని అన్నారని తెలిపారు. ఆ నాటి సంఘటనను ఆమె కోర్టు ముందు ఉంచారు. బర్రఫ్ ఫెర్టిలైజర్స్‌లో తనకున్న స్టేక్‌కు సంబంధించి గ్యారెంటీ పత్రంపై సంతకం చేయాలని తనతో పాటు తన కుటుంబాన్ని కూడా బెదరించారని ఆరోపించారు. తాను వేరేమార్గం లేకనే గ్యారెంటీపై సంతకం చేశానన్నారు.
మెల్బోర్న్లో బ్యాంకు అధికారులతో తమ సమావేశానికి ముందు జరిగిన సంఘటనను కూడా రాధిక న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఏఎన్‌జడ్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ క్రిస్ పేజ్, తన భర్త ఓస్వాల్‌తో ఘర్షణ పడ్డారని తెలిపారు. ‘పేజ్ నా భర్త భుజాలను గట్టిగా ప్టటుకుని కుదిపేశాడు. నేను చూసిన వెంటనే వెనక్కి తగ్గాడు. అప్పుడు పంకజ్ ముఖం ఎర్రబడి పోయింది’ అని తెలిపారు. ఆ తర్వాత తన భర్త వణికిపోతూ కనిపించాడని అన్నారు. పేజ్ చాలా కోపంగా ఉన్న విషయాన్ని తనతో చెబుతూ డాక్యుమెంట్లపై మనం సంతకాలు చేయడమే మంచిదని తనకు చెప్పారని రాధిక కోర్టుకు తెలిపారు. అలాంటి స్థితిలో తన భర్తను అంతకుముందు ఎప్పుడూ చూడలేదన్నారు.ఇదిలాఉండగా.. గత వారం బ్యాంకు అధికారులకు, ఓస్వాల్ దంపతులకు మధ్య జరిగిన సెటిల్మెంట్ మీటింగ్ విఫలమైంది. అనంతరం న్యాయస్థానంలో ఓస్వాల్ ఈ విషయాలను తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.