ఐరన్ లేడీకి బెదిరింపులు..!
మణీపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిలకు ఇటీవలి కాలంలో బెదిరింపులు మరీ ఎక్కువయ్యాయి. ఆమె సాయుధ దళాలకు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టిన చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే.. ఆమె నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్న నిరాహార దీక్షను కొనసాగించాలని.. బయటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకోవాలంటూ కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి.
రీసెంట్ గా.. షర్మిల కోర్టులో హారైన సమయంలో తాను చేపట్టిన దీక్షను ఆగస్ట్ 9న విరమిస్తానని తెలిపారు. అలాగే తాను వివాహం కూడా చేసుకుంటానని ప్రకటించారు. దీంతో అలయెన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ( కంగ్లీపాక్ ) అనే సంస్థ స్పందించింది. తాము చేపట్టిన లక్ష్యాన్ని వదిలేసి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు హత్యకు గురైన విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేస్తోంది.
ఏఎస్ యూకే చైర్మన్ ఎన్ .ఓకెన్, వైస్ చైర్మన్ మెయిటీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ ఎన్నికల రాజకీయాల్లో చేరిన వారంతా అదే ముగింపు అని తెలిసి కూడా చేరారు’ అని అన్నారు. గోవా-బ్రిటీష్ ఉద్యమ కారుడు డెస్మండ్ కౌటిన్హోతో.. ఇరోమ్ షర్మిల మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే డెస్మండ్ ను మణిపూర్ ప్రజలు భారతీయుడిగా భావిస్తున్నారని అన్నారు. మణిపూర్ కు చెందని వ్యక్తిని ఇరోమ్ షర్మిలా వివాహం చేసుకోకూడదని హెచ్చరించారు. మణిపూర్ వాసుల పెళ్ళిళ్ళు భారతీయులతో జరుగుతున్నాయన్నారు. దీంతో స్థానికుల రక్షణ కోసమే ఉద్యమం జరుగుతోందన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.