Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rahu Gandhi attacks Mamta Banarjee

By   /  April 19, 2016  /  Comments Off on Rahu Gandhi attacks Mamta Banarjee

    Print       Email

mamata and rahulమ‌మ‌త‌పై రాహుల్ ఫైర్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆమెవ‌న్నీ మోస‌పు మాటలు

మ‌మ‌త‌ను ఓడిస్తేనే అభివృద్ధి

ప‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో తృణ‌ముల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. మ‌మ‌తా బెన‌ర్జీవ‌న్నీ మోస‌పూరిత మాట‌ల‌ని, ఆమె మాట‌ల‌తో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. గ‌త ఐదేళ్ల‌క్రింత రాష్ట్రంలో 70 ల‌క్ష‌ల మంది యువ‌కుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి అది నేటికి చేయ‌లేద‌ని, మ‌ళ్లీ ఇప్పుడు అవే వాగ్దానాల‌తో ఎన్నిక‌ల‌కు రావ‌డం సిగ్గు చేట‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో కూడా విఫ‌ల‌మైన మ‌మ‌త‌కు ఓటు అడిగే అర్హ‌త లేద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు గుర్తుకు ఉండ‌వో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిక‌లు వ‌చ్చాయి కాబ‌ట్టి ఇప్పుడు కూడా కొత్త హామీలు ఇస్తుంద‌ని, ఎన్నిక‌ల అయిపోయిన త‌ర్వాత అవి గుర్తుండ‌వ‌ని దుయ్య‌బ‌ట్టారు.

బెంగాల్‌కు ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోవ‌డానికి మ‌మ‌తానే కార‌ణ‌మ‌ని,  యువ‌తకు ఉపాధి లేక వేరే రాష్ట్రాల‌కు వ‌ల‌స‌లుపోతున్నార‌న్నారు. కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం కానీ, రాష్ట్ర‌లో మ‌మ‌త స‌ర్కార్‌కానీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌న‌కు చేసిందేమీ లేద‌న్నారు. ఏమీ చేయ‌ని ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకుంటే ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌వుతుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే శార‌దా కుంభ‌కోణం నింధితుల‌ను ఖ‌చ్చితంగా శిక్షిస్తామ‌ని  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాహుల్ హామీ ఇచ్చారు. అభివృద్ధిని చేసే పార్టీకి ఓటు వేస్తారో.. అభివృద్ధిని విస్మ‌రించిన పార్టీకి ఓటు వేస్తారో విజ్ఞులైన ప్ర‌జ‌లే ఆలోచించుకోవాల‌ని పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →