Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rahul doing ideal politics, says Jana Reddy..

By   /  March 18, 2017  /  Comments Off on Rahul doing ideal politics, says Jana Reddy..

    Print       Email

jana reddyఆదర్శ రాజకీయాలకు రాహుల్ విత్తనం లాంటి వారు: జానారెడ్డి

ఇటీవలె జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అయితే పంజాబ్ లో మాత్రం గెలిచి పరువు దక్కించుకుంది. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఐరెన్ లెగ్ అంటూ పలువురు విమర్శించారు. ఈ విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాహల్ గాంధీ ఐరెన్ లెగ్ అవునా కాదా అన్నది తర్వాత తేలుతుందని అన్నారు. మంచి రాజకీయాలు చేయడంలో రాహుల్ ఎప్పటికీ ముందుంటారని అన్నారు. ఆయన ఆదర్శ రాజకీయాలకు ఓ విత్తనం లాంటి వారని అన్నారు.

InCorpTaxAct
Suvidha

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల గురించి కూడా జానారెడ్డి మాట్లాడారు. తాను ఇక అసెంబ్లీలో బడ్జెట్‌ పై మాట్లాడబోనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిసారి త‌ప్పుడు లెక్క‌లే చెబుతోంద‌ని విమర్శించారు. వచ్చే ఏడాది తెలంగాణ‌ అసెంబ్లీలో ప్ర‌వేశ‌ పెట్టే బడ్జెట్‌పై కూడా తాను మాట్లాడనని చెప్పారు. తన బదులు వేరే వారికి అవకాశం ఇస్తానని తేల్చి చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →