Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Rahul floors Delhi Daredevils with fastest IPL fifty

By   /  April 8, 2018  /  Comments Off on Rahul floors Delhi Daredevils with fastest IPL fifty

    Print       Email

బోణీ చేసిన పంజాబ్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజ‌యం
* రాణించి లోకేశ్ రాహ‌/ల‌్‌
డెక్క‌న్ అబ్రాడ్‌: ఐపీఎల్-11వ సీజన్‌లో భాగంగా ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలీ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు బోణీ కొట్టింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీ డేర్‌డేవిల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల విజయలక్ష్యాన్ని పంజాబ్ (18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) మరో 7 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. పంజాబ్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో రాణించి (16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) 51 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఈ క్రమంలో ఆది నుంచి దూకుడుగా రాణిస్తూ పరుగుల వరద పారించాడు. ఒక దశలో బోల్ట్ బౌలింగ్‌లో రాహుల్ మహ్మద్ షమీకి క్యాచ్ ఇవ్వడంతో వెనుదిరిగాల్సి వచ్చింది.


ఆ తరువాత వచ్చిన కరుణ్ నయర్ అద్భుత ప్రదర్శనతో చెలరేగి ఆడాడు. (33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్) బాదిన నయర్.. 50 పరుగులు సాధించి హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే క్రిస్టియన్ బౌలింగ్‌లో బోల్ట్‌కు క్యాచ్ ఇచ్చిన కరుణ్ పెవిలియన్‌కు చేరాడు. మిగతా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ (7), యువరాజ్ సింగ్ (12), డేవిడ్ మిల్లర్ (24 నాటౌట్), స్టెయిన్స్ (22 నాటౌట్‌)గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో బోల్ట్, మోరీస్, క్రిస్టియన్, టెవాటియా తలో వికెట్ తీసుకున్నారు.

 

 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 167 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) 55 పరుగులతో హాఫ్ సెంచరీతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. గంభీర్ మినహా మిగతా ఆటగాళ్లు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →