Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rahul Gandhi Caught Sleeping in Parliament

By   /  July 21, 2016  /  Comments Off on Rahul Gandhi Caught Sleeping in Parliament

    Print       Email

RahulGandhiఆయ‌న అంతే!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి యువ‌రాజు.. అంతేకాదు ఆశాకిర‌ణం కూడా. భ‌విష్య‌త్ ప్ర‌ధాని ఆయ‌నే అని కూడా ఆ పార్టీ చెబుతుంటుంది. అలాంటి వ్య‌క్తి దేశ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయిలో ఉండాలి. కానీ 120 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి కీల‌క నేత‌గా ఉన్న రాహుల్ గాంధీ మాత్రం అలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. కీల‌క స‌మ‌యాల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్ల‌మెంట్‌లో వాడీవేడిగా చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో నిద్ర‌పోతున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే… ఇటీవల గుజరాత్ లోని ఉనాలో నలుగురు దళిత యువకులను గోమాంసం పంపిణీ చేస్తున్నారంటూ గోసంరక్షణ సంస్థ సభ్యులు చితక్కొట్టిన ఘటన తెలిసిందే. ఆ నలుగురు యువకులను పట్టుకున్న గోసంరక్షణ సంస్థ సభ్యులు వారిని అర్ధనగ్నంగా మార్చి – ఓ కారుకి వారి చేతులని కట్టేసి కొట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వ్యక్తి తీసిన ఈ ఘటన దృశ్యాలు దేశమంతటా కలకలం రేపిన సంఘ‌ట‌న తెలిసిందే. ఈ అంశంపైనే నిన్న పార్లమెంటు ఉభయసభల్లో రగడ కొనసాగింది. ఆ రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో గ‌ళం విప్పాయి.

ఇటువంటి ఘటనలకు పాల్పడుతోన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దళిత యువకులపై దాడిపై రాజ్యసభలో చర్చించాల్సిందేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ కూడా చేశారు. దీంతో గుజరాత్ లో దళితులపై దాడి అంశంలో లోక్ సభలో కేంద్రం హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. దళితులపై జరిగిన దాడిని ఖండించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశం పట్ల విచారం వ్యక్తం చేశారని – ఘటనను తీవ్రంగా తీసుకున్నారని – ఇటువంటి దాడులు సాంఘిక నేరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ఇటువంటి సమస్యలను సవాలుగా తీసుకోవాలని – వాటి నిర్మూలనకు కృషి చేయాలని ఆయన అన్నారు.

కాగా కాంగ్రెస్ పై రాజ్ నాథ్ సింగ్ చేసిన ఆరోపణల పట్ల దళితులపై దాడుల అంశంపై ఆయన చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను హోంమంత్రి మరింత పెద్దదిగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా జ‌రుగుతున్న స‌మ‌యంలో రాహుల్ గాంధీ హ్యాపీగా పార్లమెంటులోనే నిద్రపోయారు. మోడీ సొంత రాష్ట్రంలో – బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ లో దళితులు ఇన్ని కష్టాలు పడుతుంటే .. పార్లమెంటులో దానిపై చర్చ వాడివేడిగా జరుగుతుంటే కునుకు తీసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించగలరని ఆ పార్టీ నేతలే చ‌ర్చించుకుంటున్నారు. ఏదేమైనా అంత‌పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న పెద్ద‌దిక్కుగా క‌నిపిస్తున్న స‌మ‌యంలో రాహుల్ గాంధీ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఆయ‌న‌తో పాటు ఆ పార్టీకి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →