రాహుల్ సారీ చెప్పాలి!
అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారా? ఆయన చేసే కామెంట్స్‌తో కాంగ్రెస్‌కు చెడ్డపేరు వస్తోందా? అంటే తాజా పరిణామాలను గమనిస్తే అవుననే చెప్పాల్సి వస్తోంది. రాహుల్ గాంధీ గతంలో మహాత్మా గాంధీని ఆర్ ఎస్ ఎస్ చంపిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై ఆర్ఎస్ఎస్ కోర్టుకు వెళ్లింది. దీనిపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘మీరేం మాట్లాడుతున్నారో.. అది ప్రజలకు మంచిదా? లేదా? అనే విషయాన్ని ఆలోచించాలి. ఒక సంస్థపై ఇలాంటి నిందలు వేయలేరు. మీరు చేసిన వ్యాఖ్యతో ఆ సంస్థలో ఉన్న అందరిని తప్పు పట్టినట్లైంది’’ అని సుప్రీం ఘాటుగా మండిపడింది. ఒక సంస్థపై అంత పెద్ద నిందను ఎలా మోపగలరు? అంటూ ప్రశ్నించటమే కాదు.. ఆ వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలంది. ఈ ఉదంతంలో తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావటమే కాదు.. వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకోసం ఈ నెల 27 వరకూ టైమిచ్చింది.
కాగా రాహుల్ తరఫు న్యాయవాదులు ఆయన చేసిన వ్యాఖ్యల్ని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. రాహుల్ వ్యాఖ్యల్లో నిజం ఎంతో.. ప్రజలకు మంచి చేసే విషయం ఏమిటో నిరూపించుకోవాలని కోర్టు స్పష్టం చేయటం గమనార్హం. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో ఆయన కేసు ఎదుర్కోవాల్సిఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. మరీ.. ఇబ్బందికర పరిస్థితిని రాహుల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.