Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Rahul, Kejriwal join students protest over Rohith Vemula..

By   /  February 24, 2016  /  Comments Off on Rahul, Kejriwal join students protest over Rohith Vemula..

    Print       Email

kejriwal at delhi - rohit vemula

రోహిత్ కు సంఘీభావంగా ఢిల్లీలో భారీ ప్రదర్శన..
హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు సంఘీభావం ప్రకటిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో జేఎన్ యూ విద్యార్ధులు, ఎన్ఎస్ యూ ఐ, ఆప్ విద్యార్ధి విభాగానికి చెందిన నేతలు పాల్గొన్నారు. వీరు చేపట్టిన ప్రదర్శనకు ఏఐసీసీ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వర్సిటీల్లో కొత్త ఆలోచనలు వెలుగులోకి రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని ఆరోపించారు. దేశంలో ఉన్న అందరికి మాట్లాడే హక్కు ఉందని అన్నారు. బీజేపీ దేశంలో ఉన్న ప్రజలపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. ఇండియా భవిష్యత్తు గురించి రోహిత్ వేముల ఎన్నో కలలు కన్నారని.. కాని వాటిని ఆర్ఎస్ఎస్ కల్లలు చేసిందని ఆరోపించారు.

InCorpTaxAct
Suvidha

రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులే కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. తక్షణం పదవుల నుంచి కేంద్రమంత్రి దత్తత్రేయ, స్మృతీ ఇరానీలను తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత విద్యార్ధుల గొంతు నొక్కేందకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యార్ధులతో మోదీ చెలగాటం ఆడటం మానుకోవాలని సూచించారు. విద్యార్ధులు తలచుకుంటే మోదీ పీఠం కదిలిపోవడం ఖాయమని అన్నారు. రోహిత్ అంశంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా స్పందించారు. పార్లమెంట్ లో రోహిత్ ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. విద్యార్ధులు చేపట్టిన పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. నిర్భయ చట్టంలాగ రోహిత్ చట్టాన్ని కూడా తీసుకురావల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →