Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

PV’s dream fulfilled!

By   /  August 24, 2016  /  Comments Off on PV’s dream fulfilled!

    Print       Email

Charminar_WAP7పీవీ క‌ల నెర‌వేరింది!

 

InCorpTaxAct
Suvidha

 

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు క‌ల నెర‌వేరింది. నంద్యాల నుంచి ఎర్ర‌గుంట్ల‌కు రైలు మార్గం వేయాల‌నేది పీవీ కోరిక‌. అయితే అది అప్ప‌ట్లో నెర‌వేర‌లేదు. ఇప్పుడు బాబు హ‌యాంలో అది సాధ్య‌మైంది. రూ.967 కోట్ల వ్య యంతో 123 కి.మీ. రైలు మార్గం నంద్యాల- కడప ప్యాసింజ‌ర్ రైల్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్ర‌భు, వెంక‌య్య నాయుడు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నా యుడు మాట్లాడుతూ నంద్యాల -ఎర్ర గుంట్ల రైలు మార్గం వేయాలనేది నాటి ప్రధాని పీవీ నరసింహారావు కల అని ఇప్పుడు అది నెర‌వేరింద‌న్నారు. ఏపీపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రైల్వే మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 40 ఏళ్లు పడుతుందని.. అందుకే కొత్త హామీలు ఇవ్వొద్దని ప్రధాని మోదీ సురేశ్ ప్రభుకు సూచించారని వెంకయ్య చెప్పారు. రైల్వేల ఆధునికీకరణకు, ఆదాయం పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

 
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు అభిప్రాయపడ్డారు. రైలు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానితో రాయలసీమ ప్రాంతాన్ని కలుపుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం కేంద్రం నుంచి అందుతుందని ఆయన స్పష్టం చేశారు. నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం ప్రారంభంతో రాయలసీమ అభివృద్ధికి మార్గం సుగమమయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ రైలు మార్గం ద్వారా రాయలసీమలో ఎన్నో కీలక మార్పులు వస్తాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలకు కనెక్టివిటీ పెరుగుతుందని, నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గానికి 1996లోనే స్థలం కేటాయించామని.. ప్రాజెక్టు పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టిందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →