Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Railway Minister Suresh Prabhu announced 3 new trains to AP

By   /  July 1, 2016  /  Comments Off on Railway Minister Suresh Prabhu announced 3 new trains to AP

    Print       Email

Suresh prabhu -newఏపీపై ద‌య‌చూపిన ప్ర‌భు!

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించిన రాష్ట్రానికి ఎంతోకొంత మేలు చేయాల‌నుకున్నారు. అంతే అనుకున్న‌దే త‌డువుగా ఏపీకి మూడు కొత్త రైళ్ల‌ను ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ప్ర‌భు ద‌య చూపారు అంటూ  ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ రాజధానికి రాయలసీమ ప్రజలు రావటానికి వీలుగా ఒక రైలు ఏర్పాటు చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినతిని రైల్వే మంత్రి ఓకే అనటమే కాదు.. ఆ దిశగా రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులుచేస్తున్నారు.  ప్రస్తుతానికి వారంలో మూడుసార్లు నడిచే ఈ రైలు విజయవాడ – ధర్మవరం మధ్యన నడవనుంది. త్వరలోనే ఈ ట్రైన్ ను స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు..  ఏపీ రాజధాని నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఒక ట్రైన్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పైనా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి.. ఓకే చేసేశారు. వారంలో ఒక్కరోజు మాత్రమే నడిచే ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ త్వరలోనే పట్టాల మీదకు ఎక్కనుంది.

ఇక‌పోతే విశాఖపట్నం నుంచి విజయవాడకు నిరంతరం రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా డబుల్ డెక్కర్ రైలును నడపాలన్న నిర్ణయాన్ని రైల్వే శాఖ తీసుకుంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసిన నేపథ్యంలో.. మరికొన్ని అనుమతులు వచ్చిన వెంటనే.. ఈ రైలు కూడా నడుస్తుందని చెబుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఈ మూడు రైళ్లు ఏపీ రాజధాని విజయవాడ నుంచి పట్టాల మీద పరుగులు పెట్టనున్నాయ్. కాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టి రాష్ట్రానికి మేలు చేసింద‌ని ప‌లువురు పేర్కొన‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →