తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో..?
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ తమిళ్ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు తెలుగుకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్ టైనర్ లలో నటించి ప్రత్యేకత చాటుకున్నాడు. అలాగే మల్టీ స్టారర్ చిత్రాల్లో కూడా నటించాడు. తాజాగా తమిళ ఇండస్ట్రీపై కన్నేశాడు. ప్రస్తుతం గెస్ట్ రోల్ కనిపించినా తర్వాత హీరోగా ఓ చిత్రం చేయాలని భావిస్తున్నాడట.
జై, అంజలి జంటగా నటిస్తున్న ‘బెలూన్’ మూవీలో రాజ్ తరుణ్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని తన ఎంట్రీకి ఉపయోగించుకోవాలని రాజ్ తరుణ్ భావిస్తున్నాడట. ఈ మూవీతో అక్కడి ప్రేక్షకులకు పరిచయం అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడట. తర్వాత స్ట్రెయిట్ చిత్రం చేయాలని స్కెచ్ వేసుకున్నాడట. ఇక ఈ మూవీ రాజ్ తరుణ్ కి బాగానే కలిసివస్తుందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి తమిళ్ లో కూడా తనదైన శైలిలో కామెడీని పండిస్తాడేమో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.