Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Raja the Great to appear in a new look..!

By   /  August 13, 2017  /  Comments Off on Raja the Great to appear in a new look..!

    Print       Email

సరికొత్త అవతారంలో కనిపించనున్న రాజా ది గ్రేట్..!

 

EIS
EnGeniusInc

 

 

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15న టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ గా కనిపిస్తారని తెలిపారు. అలాగే కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాజాది గ్రేట్ కొత్త అవతారంలో వస్తున్నాడని దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్ లో తెలిపారు.

ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఇదిలాఉండగా రవితేజ టచ్ చేసి చూడు అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TDP-BJP will win in Kakinada muncipal corporation elections: Kimidi KalaVenktarao

Read More →