జక్కన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈయన తీసుకునే అమౌంట్ చూసి టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు.. బాలీవుడ్ హీరోలు, దర్శకులు కూడా నోరెళ్ళబెడుతున్నారు. ఇలా రెమ్యూనరేషన్ విషయంలో జక్కన్న కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాడు.వరుసగా పది హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ కి నిర్మాతలు కూడా అడిగినంతా ముట్టచెబుతున్నారు.
బాహుబలి ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా 650 కోట్ల మేర వసూలు చేసింది. మొదటి పార్ట్ లో జక్కన్నకు 30కోట్ల వరకు రెమ్యూనేషన్ కింద ముట్టినట్లు సమాచారం. అయితే సెకెండ్ పార్ట్ విషయంలో మాత్రం జక్కన్న వాటా తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రిలీజ్ కి ఏడాది సమయం ఉండగానే ‘బాహుబలి-ది కంక్లూజన్’ బిజినెస్ హాట్ కేక్ లా జరుగుతోంది. ఈ సెకెండ్ పార్ట్ కి రాజమౌళి ఏకంగా 70 నుంచి 100కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. హిందీ, తమిళం బిజినెస్ అమౌంట్ లో సగం జక్కన్నకు రెమ్యునరేషన్ గా ఇచ్చేందుకు నిర్మాతలు ఒకే చెప్పారట. ఈ రెండు భాషల్లో బాహుబలి 2 ఎంత లేదన్న150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. ఇందులో సగం అంటే 75 నుంచి 100 కోట్ల రాజమౌళికి ముట్టుతాయి. ఓ రేంజ్ లో భారీ హిట్స్ ఇచ్చే జక్కన్నకు ఈ మాత్రం ఇవ్వాల్సిందే కదా.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.