Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Rajamouli to direct Suer Star Rajnikanth

By   /  April 10, 2017  /  Comments Off on Rajamouli to direct Suer Star Rajnikanth

    Print       Email

Rajamouli 3సూపర్ స్టార్ తో సినిమా తీస్తా: రాజమౌళి

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ జక్కన్న బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సీక్వెల్ త్వరలో విడుదల కానుంది. అయితే రాజమౌళి బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ ను తమిళనాట నిర్వహించారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో బాహుబలి-2 తమిళ ఆడియో విడుదల కార్యక్రమం, మీడియా సమావేశం జరిగాయి. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడారు. ప్రస్తుతం త‌న‌ మైండ్ లో బాహుబలి తప్ప వేరే ఆలోచన ఏదీ లేదన్నారు. కానీ రజనీతో ఏదో ఒకరోజు సినిమా తీస్తాన‌ని అన్నారు. బాహుబలి సినిమా వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపించే ఓ ఊహాజనితమైన కథ అని చెప్పుకొచ్చారు.

బాహుబలి2లో యుద్ధ సన్నివేశాల్లో అప్పట్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారో ఊహించుకొని వాటినే చూపించామ‌ని చెప్పారు. బాహుబ‌లి-2లో పాత్రల మధ్య సంఘర్షణ మాత్రమే తెరపై కనిపిస్తుందని అన్నారు. ఈ సినిమాలోని పాత్ర‌లను మరింత బాగా వివరించేందుకు టీవీ సీరీస్‌, యానిమేషన్స్‌, ఇతర రూపకాల్లో కొనసాగిస్తామ‌న్నారు. త‌న‌కు మహాభారతం తీయాలని ఎప్పటినుంచో ఉందని కూడా చెప్పారు. అయితే తాను తీయడానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు మాత్రమే ఆ విష‌యంపై చెబుతాన‌ని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →