బాహుబలి నెలకు స్వాగతం చెప్పిన జక్కన్న.. పీక్ స్టేజ్ కి బాహుబలి 2 ప్రమోషన్స్..
ప్రేక్షకులు ఉత్కంఠకు ఈ నెలలో తెరదించనున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఏప్రిల్ 28న ‘బాహుబలి ది కంక్లూజన్’ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ ఏడాది బాహుబలి నామ సంవత్సరం అని అన్నారు. అంటే ముందుగానే ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారన్నమాట. ఇక సినిమా ఎంతబాగా వచ్చినా ఈ రోజుల్లో ప్రమోషన్స్ అనేవి కీలకంగా మారాయి. ఇందులో రాజమౌళిది అందెవేసిన చెయ్యి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ని ఎంతో చాకచక్యంగా జనంలోకి తీసుకెళ్లారు. సినిమాపై హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక బాహుబలి ది బిగినింగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే తరహాలో బాహుబలి2ని కూడా జక్కన్న ప్రమోట్ చేస్తున్నారు.
ఈ మూవీలో భళ్లాల దేవుడిగా రానా దగ్గుబాటి నటించారు. ఇక జక్కన్న ప్రమోషన్ లో భాగంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాహుబలి నెలకు స్వాగతం అంటూ భళ్ళాల దేవుడు ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రానా వెనుక మూడు సింహాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆటోమేటిక్ గా రానాను ప్రేక్షకులు నాలుగో సింహం అనుకుంటారు. అంటే రానా పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఇలా చెబుతున్నారని భావించవచ్చు. ఇక సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇలా పోస్టర్ల రూపంలో మంచి విందు అందిస్తారన్నమాట. ఇలా ప్రమోషన్ పేరు చెప్పి రోజుకో కొత్త విషయం చెబుతారన్నమాట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.