Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Rajani kanth spent 2 months in US

By   /  July 27, 2016  /  Comments Off on Rajani kanth spent 2 months in US

    Print       Email

rishi kapoorఊహాగానాల‌కు చెక్ చెప్పిన ర‌జ‌నీ

 

InCorpTaxAct
Suvidha

 

 

గత కొంతకాలంగా రజనీకాంత్‌పై వస్తున్న ఊహాగానాలకు ఆయనే చెక్‌పెట్టారు. దాదాపు రెండు నెలల పాటు అమెరికాలో ఎందుకున్నారన్న విషయాన్ని తెలిపారు. రజనీకాంత్‌ అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన సందర్భంగా ఈ విషయాలు ఓ లేఖలో వెల్లడించారు.”నేను శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న 2.0 (రోబోకు సీక్వెల్‌) చిత్రం, భావోద్వేగాలు, విప్లవాత్మక అంశాలు నిండిన చిత్రం ‘కబాలి’ చిత్రీకరణల్లో వరుసగా పాల్గొన్నాను. దీని వల్ల కొంత మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. దాని నుంచి ఉపశమనం పొందేందుకు విశ్రాంతి అవసరం అని అర్థమైంది. అందుకే నా కూతురు ఐశ్వర్య ధనుష్‌తో కలిసి రెండు నెలలపాటు అమెరికా టూర్‌కు వెళ్లాను. అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నా మాతృదేశానికి వచ్చాక మళ్లీ కొత్త బలం వచ్చింది.

కబాలి చిత్రం విజయం గురించి విన్నాక మనసు మరింత ప్రశాంతంగా మారింది’ అని పేర్కొన్నారు. కబాలి విజయం సందర్భంగా దర్శక, నిర్మాతలకు, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్‌ ఎయిర్‌పోర్టు ఉన్నప్పటి ఫొటోను రిషీ కపూర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ” రజనీ నిరాడంబరతకు ఇదే నిదర్శనం. అమెరికా ఎయిర్‌పోర్టులో తనిఖీ నిమిత్తం సాధారణ ప్రయాణీకులతో కలసి నిలబడ్డారు. మీ అణకువకు ఇదే నా వందనం’ అంటూ ఆయన ట్వీట్‌ చేయడం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →