జూలై1న `కబాలి`
రజినీ చెప్పిన డైలాగులతో రిలీజ్ అయిన ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. మరి ఇలాంటి డైలాగులు ఎన్నో ఉన్న కబాలి చిత్రం రిలీజ్ అయితే అభిమానులకు ఇక పండుగే. అయితే ఈ చిత్ర విశేషాలను నిర్మాత కలైపులి యస్.థను చెప్పుకొచ్చారు. జూన్ తొలివారంలో కబాలి పాటలను, జులై 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ సినిమా నిర్మించడమనేది ఓ నిర్మాతకు అరు దైన అవకాశమని అలాంటిది అంత గొప్ప అవ కాశాన్ని రజినీకాంత్ తనను పిలిచి ఇచ్చారని సంబరపడిపోతున్నారు. ఇది తన లైఫ్టెమ్ అచీవ్మెంట్ కింద లెక్క అని మురిసిపోతున్నాడు. టీజర్లో రజినీ చెప్పిన డెలాగులకు చాలా మంచి స్పందన వచ్చిందిదని, అంతకన్నా గొప్ప డెలాగులు, అభిమానులకు నచ్చే డెలాగులు సినిమాలో చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వాటిని ఆడియో వేడుకలో విడుదల చేద్దా మని రంజిత్ అన్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత గొప్ప దర్శకుల్లో ఒకరిగా పా రంజిత్‌కు పేరు వస్తుందన్నారు. రజినీకాంత్‌కున్న సూపర్‌స్టార్ ఇమేజ్ను మనసులో పెట్టుకుని ట్రైలర్ మేడ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి మాకు ఆయన చెప్పిన తీరును మర్పిపోలేమన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.