Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Rajinikanth to act in a drama for Nadigar Sangam

By   /  March 23, 2016  /  Comments Off on Rajinikanth to act in a drama for Nadigar Sangam

    Print       Email

rajani kanth

మళ్ళీ నాటక రంగంలోకి రజనీకాంత్..

InCorpTaxAct
Suvidha

 

సినిమాల్లోకి వచ్చి స్టార్ డమ్ సంపాదించిన నటులు.. అంతకుముందు నాటకాల ద్వారా తమ నటనాభిలాష కనబరిచేవారు. రజనీకాంత్ కూడా ఈ కోవకు చెందిన వారే. బస్ కండక్టర్‌గా చేస్తున్న రోజుల్లోనే నాటకాల ద్వారా తనలోని నటుడుని బయటకు తీసుకువచ్చారు. నాటకాల ద్వారా చాలామందిని అలరించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు సూపర్‌స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు అందరికి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత రజనీకాంత్ ఓ నాటకంలో నటించనున్నారట. అదీ ఓ నటీనటుల ఉపయోగపడే ఓ పనికోసమట.

 

తమిళనాడు నడిగర్ సంఘం తరపున యాక్టర్స్ కి అందరికి ఉపయోగపడేందుకు ఓ భవనం నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని నడిగర్ సంఘం ఎన్నికల ముందు నుంచి విశాల్ అండ్ కో చెబుతూ వస్తున్నారు. అయితే దీని నిర్మాణ వ్యయం 25 కోట్ల వరకూ ఉంటుందట. దీనికోసమే నటీనటులతో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించి తద్వారా వచ్చిన మొత్తంతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు. అయితే మ్యాచ్‌తో అంత మొత్తం సమకూరడం కష్టం అని తేలిందట. దీంతో నాటకాలకు ప్లాన్ చేశారట విశాల్ టీమ్ సభ్యులు. ఈ నాటకాలలో రజనీకాంత్ ని కూడా పాల్గొనాల్సిందిగా నాజర్, విశాల్ కోరగా అందుకు ఆయన సరేనన్నారట. అలా ఇన్నాళ్ళ తర్వాత నాటకాల్లోకి రజనీకాంత్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →